Header Banner

ఇడ్లీ, దోశ‌, పూరీల‌కు బ‌దులుగా రోజూ వీటిని తినండి! బ‌రువు తగ్గడంతో పాటు ఎన్నో లాభాలు!

  Sun Feb 02, 2025 18:40        Life Style

అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డం అన్న‌ది ఎంత క‌ష్టంగా మారిందో అంద‌రికీ తెలిసిందే. బ‌రువు సుల‌భంగా పెరుగుతారు. కానీ పెరిగిన బ‌రువును త‌గ్గించ‌డ‌మే చాలా క‌ష్టం. ఇందుకు గాను చాలా మంది అనేక ర‌కాల ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తుంటారు. వ్యాయామం చేయ‌డం, స‌రైన డైట్‌ను పాటించ‌డం, యోగా వంటివి చేస్తుంటారు. అయితే బ‌రువు త‌గ్గేందుకు డైట్ ముఖ్య పాత్ర పోషిస్తుంద‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు. డైట్‌ను కంట్రోల్ చేయ‌డం, స‌మ‌తుల ఆహారాన్ని తింటే అధిక బ‌రువును సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చ‌ని వారు అంటున్నారు. ముఖ్యంగా ఉద‌యం తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు ఉండాల‌ని, ఇవి శ‌రీరానికి శ‌క్తిని అందించ‌డంతోపాటు అధిక బ‌రువు త‌గ్గేలా చేస్తాయ‌ని అంటున్నారు. ఉద‌యం తీసుకునే ఆహారం చాలా బ‌ల‌వ‌ర్ధ‌క‌మైంది అయి ఉండాల‌ని వారు సూచిస్తున్నారు.

 

ఉల‌వ‌ల‌ను ఆహారంలో భాగం చేసుకుంటే ప్రోటీన్లు స‌మృద్దిగా ల‌భిస్తాయి. ఇవి శ‌రీరంలో వేడిని పెంచుతాయి. దీంతో కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. ఉల‌వ‌తో చేసే వ‌డ‌ల‌ను ఉద‌యం ఆహారంలో తిన‌వ‌చ్చు. ఉల‌వ‌లు, శ‌న‌గ పిండి లేదా శ‌న‌గ ప‌ప్పు, కూర‌గాయ‌లు, మ‌సాలాల‌తో వ‌డ‌ల‌ను త‌యారు చేసి తింటే మేలు జ‌రుగుతుంది. ఇవి ప్రోటీన్ల‌ను అందిస్తాయి. బ‌రువు త‌గ్గేందుకు స‌హాయం చేస్తాయి. అలాగే ఉద‌యం బ్రేక్ ఫాస్ట్‌లో మూంగ్ దాల్ చిల్లాను కూడా తిన‌వ‌చ్చు. పెస‌ల‌తో త‌యారు చేసే ఈ వంట‌కంలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. పెస‌ల‌ను నాన‌బెట్టి దీన్ని త‌యారు చేయాల్సి ఉంటుంది. ఇందులోనే మిరియాల పొడి, కూర‌గాయ‌లు క‌లిపి చేసుకోవ‌చ్చు. ఈ వంట‌కాన్ని తిన‌డం వ‌ల్ల మెట‌బాలిజం పెరుగుతుంది. కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు.

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు!  

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

మొల‌క‌ల‌తో స‌లాడ్ త‌యారు చేసి కూడా ఉద‌యం బ్రేక్ ఫాస్ట్‌లో తిన‌వ‌చ్చు. పెస‌లు, శ‌న‌గలు త‌దిత‌ర మొల‌క‌ల‌ను స‌లాడ్ లా త‌యారు చేసి ఉద‌యం బ్రేక్ ఫాస్ట్‌లో తిన‌వ‌చ్చు. ఇది ఆరోగ్యాన్ని అందించ‌డమే కాదు.. శక్తిని ఇస్తుంది. పోష‌కాల‌ను అంద‌జేస్తుంది. బ‌రువు త‌గ్గేందుకు స‌హాయం చేస్తుంది. శ‌న‌గ‌పిండితో చిల్లా అనే వంట‌కాన్ని త‌యారు చేసి కూడా ఉద‌యం అల్పాహారంలో భాగంగా తిన‌వ‌చ్చు. ఇందులో గ్లూటెన్ ఉండ‌దు. క‌నుక సుల‌భంగా జీర్ణ‌మ‌వుతుంది. ఎవ‌రైనా స‌రే సుల‌భంగా తిన‌వ‌చ్చు. శ‌న‌గ పిండి, ఉప్పు, మిరియాల పొడి, కూర‌గాయ‌ల‌తో దీన్ని త‌యారు చేసి తింటే ఆరోగ్యంగా ఉంటారు. శ‌క్తి ల‌భిస్తుంది. అధిక బ‌రువు త‌గ్గేందుకు స‌హాయం చేస్తుంది.

 

పాల‌తో త‌యారు చేసే ప‌నీర్‌లో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. ప‌నీర్‌తో ఉద‌యం వంట‌కాల‌ను చేసి కూడా తిన‌వ‌చ్చు. దీంతో ప్రోటీన్లు స‌మృద్ధిగా ల‌భిస్తాయి. ప‌నీర్‌తో ఉద‌యం ప‌నీర్ భుర్జిని త‌యారు చేసి తిన‌వ‌చ్చు. ఉల్లిపాయ‌లు, ట‌మాటా, శ‌న‌గ‌పిండితో దీన్ని త‌యారు చేయాల్సి ఉంటుంది. ఇది కూడా మ‌న‌కు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. అలాగే ఉద‌యం అల్పాహారంలో దాలియా ఉప్మాను కూడా తీసుకోవ‌చ్చు. ఇది ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన‌, బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన ఆహారం. గోధుమ ర‌వ్వ‌తో దీన్ని త‌యారు చేస్తారు. ఇందులో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ప్రోటీన్లు కూడా ఎక్కువ‌గానే ఉంటాయి. ఇవి జీర్ణ‌క్రియ‌ను మెరుగు ప‌రుస్తాయి. అధిక బ‌రువు త‌గ్గేందుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఇలా ప‌లు ర‌కాల ఆహారాల‌ను ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా తింటే శ‌రీరానికి శ‌క్తి ల‌భించి ఆరోగ్యంగా ఉంటారు. రోజంతా ఉత్సాహంగా ప‌నిచేస్తారు. చురుగ్గా ఉంటారు. దీంతోపాటు కండ‌రాలు నిర్మాణం అవుతాయి. అలాగే అధిక బ‌రువును కూడా త‌గ్గించుకోవ‌చ్చు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బ‌డ్జెట్‌-2025.. మధ్యతరగతికి భారీ ఊరట.. బడ్జెట్ తో ధరలు దగ్గేవిపెరిగేవి ఇవే!

 

ఆదాయ పన్నుపై కేంద్రం గుడ్ న్యూస్! కొత్త పన్ను విధానంలో.. సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట..

 

మ‌హిళల‌కు గుడ్‌న్యూస్.. ఈ ప‌థ‌కం కింద వ‌చ్చే ఐదేళ్ల‌లో రూ. 2కోట్ల వ‌ర‌కు రుణాలు!

 

రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు ప్రకటించిన కేంద్ర మంత్రి! 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు..

 

అమెరికాలో మరో ప్రమాదం.. విమానం కూలడంతో సమీపంలోని ఇళ్లుకార్లు దగ్ధం!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #LifeStyle #Foods #Diet #Calcium